నాటు నాటు పాట ప్రపంచం నలుమూలలకు విస్తరించి బోలెడు అవార్డులు సంపాదించి..చివరిగా ఆస్కార్ బరిలోను నిలిచింది.. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎంతోమంది సెలబ్రిటీలు, సినీ ప్రియులు ఈ పాటకు కాలు కదిపారు. కాగా, ఈ మాసీ డ్యాన్స్ నంబర్ దాయాది దేశం పాకిస్థాన్ లోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దీనికి ఫిదా అయిన పాక్ నటి హనియా ఆమిర్.. తాజాగా ఓ పెళ్లి వేడుకలో ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. వేడుకకు వచ్చిన బంధువులందరూ చూస్తుండగా.. నాటు నాటు హుక్ స్టెప్పులు వేసి అలరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
in వైరల్, హీరోయిన్స్
GIPHY App Key not set. Please check settings