రెండు చేతులతో ఒకేసారి రాయడం, అందులోనూ 11 రకరకాల స్టైల్స్‌లో రాయగలగడమంటే నిజంగా సూపర్ టాలెంట్ అనే చెప్పాలి. కర్ణాటకలోని మంగళూరు చెందిన ఓ బాలిక ఆది స్వరూప (Aadi Swaroopa) మాత్రం ఈ విషయంలో తన స్పెషల్ టాలెంట్ చూపిస్తుంది. ఆమె తన రెండు చేతులతో ఒకేసారి ఒకటికాదు రెండుకాదు ఏకంగా 11 రకాల స్టైల్స్‌లో రాయగలదు. అవును మీరు విన్నది నిజమే. ఇలా ఆమె రాస్తున్న స్టైల్స్ తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆమె అలా రాస్తున్న వీడియోను రవి కర్కారా అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. “ఆమె బ్రెయిన్ లోని రెండు పార్టులూ ఒకే సమయంలో పనిచేయగలవు. ఇలాంటి వారు 10 లక్షల మందిలో ఒకరే ఉంటారు” అనే క్యాప్షన్‌తో ఆయన ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 20లక్షల మందికి పైగా వీక్షించారు. అలాగే 50వేలకు పైగా లైక్క్ వచ్చాయి. ఇకపోతే ఈ స్కిల్‌ని యాంబీడెక్స్‌టెరిటీ (Ambidexterity) అంటారని రవి కర్కారా పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
She is 'Aadi Swaroopa' from Mangalore. She can WRITE in 11 different style. Both Parts of her BRAIN functions at the Same Time, one in a million. Amazing!
![]()
This Skill is Known as Ambidexterityhttps://t.co/n3p0LtLksT pic.twitter.com/31g58QrDlb
— Ravi Karkara (@ravikarkara) February 5, 2023
This post was created with our nice and easy submission form. Create your post!

GIPHY App Key not set. Please check settings